Kejriwal: 2-3 రోజుల్లో కేజ్రీవాల్‌ అరెస్టు.. దిల్లీ మంత్రుల సంచలన వ్యాఖ్యలు

ఆప్‌(AAP) చీఫ్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోందని, రెండు మూడు రోజుల్లో ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని దిల్లీ మంత్రులు ఆరోపణలు చేశారు. 

Published : 23 Feb 2024 15:42 IST

దిల్లీ: భాజపా(BJP)పై దిల్లీ మంత్రి, ఆప్‌(AAP) నేత గోపాల్‌రాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు సీబీఐ నోటీసులు ఇప్పించి, ఆయన్ను అరెస్టు చేయించాలని కుట్ర పన్నుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం సీబీఐ నోటీసులు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.

‘విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటుచేసిన దగ్గరినుంచి భాజపాకు కంటిమీద కునుకు లేదు.  సీబీఐ ద్వారా ఒక నోటీసు ఇప్పించి, కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని అధికార భాజపా ప్లాన్‌ చేస్తోంది. సీఆర్‌పీసీ41ఏ కింద నోటీసు సిద్ధం చేశారని మాకు తెలిసింది. ఈడీ నోటీసుల ద్వారా వాళ్ల పాచిక పారలేదు. ఇప్పుడు సీబీఐని దుర్వినియోగం చేయాలని ప్లాన్ వేశారు. దర్యాప్తు సంస్థలు ఆప్‌ నేతలతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. కానీ అవినీతి జరిగినట్లు ఒక్క ఆధారాన్ని గుర్తించలేకపోయాయి’ అని గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ బెదిరింపులకు ఆప్‌ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు. ‘ఇండియా’ కూటమిలో భాగంగానే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.

డీల్‌కు చేరువలో ఆప్‌-కాంగ్రెస్‌.. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పొత్తుకు రెడీ!

రెండు మూడు రోజుల్లో కేజ్రీవాల్ అరెస్టు: భరద్వాజ్‌

ఆప్‌-కాంగ్రెస్ పొత్తుతో భాజపా భయపడుతోందని మరో మంత్రి సౌరభ్‌ భరద్వాజ్ అన్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు తుదిదశకు చేరుకుందన్న వార్తలు మొదలుకాగానే..ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు ఏడో నోటీసు వచ్చిందని ఆరోపించారు. ఈ రోజు ఆయనకు సీబీఐ నోటీసులు రానున్నట్లు తెలిసిందన్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన్ను అరెస్టు చేయనున్నారు. ‘ఆప్‌, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖాయమైతే.. కేజ్రీవాల్‌ అరెస్టు అవుతారని మాకు సందేశాలు వస్తున్నాయి. మీరు కావాలంటే ఆయన్ను అరెస్టు చేసుకోండి.. కానీ పొత్తు మాత్రం ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుంటే వీధుల్లో ప్రజల సునామీ వస్తుందని మరో నేత సందీప్‌పాథక్ వ్యాఖ్యలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు