DBTతో కేంద్ర పథకాల్లోనే.. రూ.2.2లక్షల కోట్ల ఆదా..!
ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) అనేది ప్రభుత్వ పథకాల్లో కీలకంగా మారిందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వెల్లడించారు. వీటి వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనే (Schemes) రూ.2.2లక్షల కోట్లు ఆదా అయ్యిందని చెప్పారు.
హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు (Beneficiaries) ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT)ను వినియోగిస్తున్నాయి. ఈ ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి వల్ల కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనే (Schemes) సుమారు 27 బిలియన్ డాలర్లు ( రూ.2.2లక్షల కోట్లు) ఆదా అయినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ వెల్లడించారు. దీన్ని వల్ల లబ్ధిదారులకు వేగంగా ప్రయోజనాలు అందడంతోపాటు ప్రభుత్వ పథకాల్లో అవినీతి నిర్మూలన సాధ్యమవుతోందన్నారు.
జీ-20 సదస్సులో భాగంగా గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రెండవ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న భారత ఆర్థికశాఖ కార్యదర్శి అజయ్ సేథ్ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ప్రజలకు, ప్రజల మధ్య, ప్రజలు-వాణిజ్యం మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాల తీరును డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పూర్తిగా మార్చివేసిందన్నారు. వేగం, లబ్ధిదారులకే నేరుగా ప్రయోజనం, తక్కువ అవినీతికి ఆస్కారం, తప్పుడు లబ్ధిదారులను ఏరివేయడం వంటి ఎన్నో మార్పులు ఈ సాంకేతికతతోనే సాధ్యమైందన్నారు.
డీపీఐ ఆధారిత డీబీటీ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలకు కీలకంగా మారిందని.. దీనివల్ల దేశ పౌరులు ఎంతో ఉపశమనం పొందుతున్నారని అజయ్ సేథ్ వెల్లడించారు. వ్యాక్సిన్లతోపాటు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా కార్యక్రమాలను దీనిద్వారానే ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 5కోట్లకు పైనే: కేంద్రం
దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. -
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్‌స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్‌లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్‌కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్‌లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్‌గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్‌కోచ్‌గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన