Heavy Rains: ₹12వేల కోట్ల నష్టం.. ‘హిమాచల్‌’ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: స్పీకర్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లో వరదలతో ఏర్పడిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కేంద్రాన్ని కోరారు.

Published : 06 Sep 2023 20:30 IST

శిమ్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్‌ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి. ఈ విపత్తును తలచుకొని ఇప్పటికీ అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా తమ రాష్ట్రంలో నెలకొన్న విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ పఠానియా కేంద్రాన్ని కోరారు. బిలాస్‌పుర్‌ జిల్లాలో భారీ వర్షాలతో  వాటిల్లిన నష్టం, సహాయక చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ సీజన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా రూ.12వేల కోట్ల ఆస్తినష్టంతో పాటు 400మందికి పైగా మృతిచెందినట్టు తెలిపారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

భాజపాను వీడిన నేతాజీ మనవడు

మరోవైపు, బిలాస్‌పూర్ జిల్లాలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ ప్రాజెక్టులు, వ్యవసాయం, హార్టీకల్చర్‌ తదితర శాఖలకు దాదాపు రూ.215 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. జిల్లాలో  ధ్వంసమైన రహదారులకు యుద్ధప్రాతిపదికన పునరుద్ధణ పనులు కొనసాగుతున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు