OTT Platforms: 18 ఓటీటీలపై కేంద్రం కొరడా

అభ్యంతరకర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. వాటితోపాటు పలు వెబ్‌సైట్‌లు, యాప్‌లపై కూడా నిషేధం విధించింది.

Updated : 14 Mar 2024 13:41 IST

దిల్లీ: అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఆన్‌లైన్ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడంతో 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, 57 సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తొలగించిన యాప్‌లో ఏడు గూగుల్‌ ప్లేస్టోర్‌లోవి కాగా, మూడు యాపిల్‌ యాప్‌స్టోర్‌లోనివిగా గుర్తించారు.

సోషల్ మీడియా ఖాతాల్లో ఫేస్‌బుక్‌లో 12, ఇన్‌స్టాగ్రామ్‌లో 17, ఎక్స్‌లో 16, యూట్యూబ్‌లో 12 ఉన్నట్లు తెలిపింది. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దేశీయంగా ఉన్న 18 ఓటీటీ వేదికలు అసభ్యకర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని, వాటిపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. తొలగించిన ఓటీటీలకు కోటికిపైగా డౌన్‌లోడ్స్‌ ఉన్నట్లు తెలిపారు. ఇవి సోషల్‌ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్‌కు సంబంధించిన ట్రైలర్‌, దృశ్యాలు, వెబ్‌లింక్‌లను ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు 32 లక్షల వీక్షణలు ఉన్నట్లు తెలిపారు. భారత్‌లో ఓటీటీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగా వెబ్‌సిరీస్‌లకు ఓటీటీ అవార్డులను ప్రవేశపెట్టామన్నారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాటిపై తప్పక చర్యలుంటాయని ప్రకటలో పేర్కొన్నారు. 

తొలగించిన ఓటీటీల వివరాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని