Mamata: భాజపాకు మమతా సవాల్‌.. కనీసం 200 స్థానాల్లో గెలవండి!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400లకుపైగా స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భాజపా.. కనీసం 200 నియోజకవర్గాల్లో గెలిస్తే గొప్ప విషయమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Updated : 31 Mar 2024 19:40 IST

కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400కుపైగా స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భాజపా చెబుతోన్న విషయం తెలిసిందే. వీటిపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కనీసం 200 నియోజకవర్గాల్లో గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేయబోమని ఉద్ఘాటించిన దీదీ.. సీఏఏకు దరఖాస్తు చేసుకుంటే విదేశీయులుగా మారతారని హెచ్చరించారు.

‘400లకుపైగా స్థానాల్లో గెలుస్తామని భాజపా చెబుతోంది. కనీసం 200 మార్కు దాటమని చెప్పండి. సవాల్‌ విసురుతున్నా. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200లకుపైగా సీట్లలో గెలుస్తామని చెప్పారు. కానీ, 77 దగ్గరే ఆగిపోయారు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

సమోసా, చాయ్‌, బిర్యానీ.. అభ్యర్థులు దేనికెంత ఖర్చు పెట్టొచ్చు?

ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సీపీఎం, కాంగ్రెస్‌లపైనా దీదీ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలూ భాజపాతో చేతులు కలుపుతున్నాయని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో ‘ఇండియా ’కూటమి లేదన్నారు. పౌరసత్వం ఉన్నవారిని విదేశీయులుగా మార్చేందుకు సీఏఏ ఒక మార్గమని బెంగాల్‌ సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను అనుమతించే ప్రసక్తే లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని