Chandrayaan-3: ల్యాండర్‌ అడుగు పెడుతున్నప్పుడు జాబిల్లిని చూశారా?

చంద్రయాన్‌-3లోని ల్యాండర్‌ ‘విక్రమ్‌’ తీసిన కొన్ని ఫొటోలను ఇప్పటికే విడుదల చేసిన ఇస్రో..  తాజాగా చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ కెమెరా క్యాప్చర్ చేసిన దృశ్యాలను షేర్‌ చేసింది.

Published : 25 Aug 2023 01:53 IST

బెంగళూరు: ప్రపంచంలో ఏ దేశం అడుగుపెట్టని జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇస్రో పంపిన చంద్రయాన్‌-3లో ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌ తన అధ్యయాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇస్రో ఓ వీడియోను విడుదల చేసింది. చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ చందమామపై దిగుతుండగా దానికి అమర్చిన కెమెరాలో రికార్డు అయిన వీడియోను షేర్‌ చేసింది. చంద్రుడిపై ల్యాండర్‌ దిగడానికి కొన్ని కి.మీల ముందు మొదలైన ఈ వీడియో.. చంద్రుడిపై అడుగుపెట్టేవరకు రికార్డయింది. ఇప్పటివరకు ల్యాండర్‌ ‘విక్రమ్‌’ తీసిన కొన్ని ఫొటోలను విడుదల చేసిన ఇస్రో.. ‘‘అడుగుపెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ కెమెరా జాబిల్లి చిత్రాన్ని ఎలా క్యాప్చర్‌ చేసిందో చూడండి’’ అంటూ 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న వీడియోను తాజాగా షేర్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని