EC: రెండు రోజుల ముందే.. ఆ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు

అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న బదులు.. జూన్ 2నే చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Updated : 17 Mar 2024 17:06 IST

దిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh), సిక్కిం (Sikkim) రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం (Election Commission) కీలక మార్పులు చేసింది. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లోక్‌సభతోపాటే జూన్‌ 4న చేపట్టనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే.. వీటి అసెంబ్లీల గడువు జూన్ 2కే ముగియనుంది. దీంతో జూన్ 4న బదులు.. జూన్ 2నే ఈ రాష్ట్రాల్లో కౌంటింగ్ చేపట్టి, మొత్తం ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక్కడి పార్లమెంటు స్థానాల ఓట్ల లెక్కింపులో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది.

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు.. ఈసీ వెబ్‌సైట్‌లో కొత్త డేటా

  • 60 అసెంబ్లీ సీట్లు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏప్రిల్‌ 19న ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. భాజపా, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, ఒక స్వతంత్రుడితో కూడిన ఎన్డీయే కూటమి పాలన సాగుతోంది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ఎన్నికల అంశాలుగా ఉన్నాయి.
  • సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోనూ ఏప్రిల్‌ 19న ఒకే దశలో పోలింగ్‌కు షెడ్యూల్‌ విడుదలైంది. భాజపా, సిక్కిం క్రాంతికారి మోర్చాలతో కూడిన ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. మహిళా సంక్షేమ పథకాలు, అవినీతే ప్రధాన ప్రచారాంశాలు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని