ECI: ఎలక్టోరల్‌ బాండ్ల కొత్త డేటా.. ఏ పార్టీకి ఎంతంటే?

ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఇచ్చిన అదనపు సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది.

Updated : 17 Mar 2024 16:46 IST

దిల్లీ: రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఇచ్చిన కొత్త సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. సీల్ట్‌ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. బాండ్ల పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐపై సుప్రీం కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త సమాచారాన్ని ఈసీ అందుబాటులో ఉంచింది. ఈసీ వెల్లడించిన డేటా ప్రకారం.. ఆయా పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తాలు ఇలా ఉన్నాయి.

  • భాజపా అత్యధికంగా రూ.6,986.5 కోట్లు విరాళాలను ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో పొందింది. వీటిలో రూ.2,555 కోట్లు కేవలం 2019-20లోనే వచ్చాయి.
  • తృణమూల్‌ కాంగ్రెస్‌ - రూ.1,397 కోట్లు
  • కాంగ్రెస్‌ పార్టీ - రూ.1,334 కోట్లు
  • భారత రాష్ట్ర సమితి (BRS) - రూ.1,322 కోట్లు
  • బిజు జనతాదళ్‌ - రూ.944 కోట్లు
  • డీఎంకే - రూ.656.5కోట్లు. ఇందులో రూ.509 కోట్లు లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌ (Santiago Martin) నుంచే వచ్చాయి.
  • వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ - రూ.442.8 కోట్లు
  • తెదేపా - రూ.181.35 కోట్లు
  • సమాజ్‌వాదీ పార్టీ - రూ.14.5 కోట్లు
  • అకాలీదళ్‌ - రూ.7.26కోట్లు
  • ఏఐఏడీఎంకే - రూ.6.05కోట్లు
  • నేషనల్‌ కాన్ఫరెన్స్‌ - రూ.50లక్షలు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని