Rajiv Kumar: ఎన్నికల వేళ.. సీఈసీ రాజీవ్‌ కుమార్‌కు ‘జెడ్‌’ కేటగిరి భద్రత

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ‘జెడ్‌’ కేటగిరి కింద వీఐపీ భద్రత కల్పించింది.

Updated : 09 Apr 2024 17:06 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ‘జెడ్‌’ కేటగిరి కింద వీఐపీ భద్రత కల్పించింది. దీంతో సాయుధ కమాండో దళాలు ఆయనకు పూర్తి రక్షణ కల్పించనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు.. లోక్‌సభ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ఆయనకు పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి భద్రతా ఏజెన్సీలు ఇటీవల సిఫార్సు చేశాయి. దీనిని పరిశీలించిన హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది సీఈసీ రక్షణ విధుల్లో ఉండనున్నారు.

1984 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాజీవ్‌ కుమార్‌.. 2020లో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. మే 15, 2022న 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం 18వ లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని