LS Polls: మోదీ హయాంలో.. ఒక్క అంగుళాన్నీ చైనా ఆక్రమించలేదు: అమిత్‌ షా

మోదీ పాలనలో భారత్‌కు చెందిన అంగుళం భూమినీ చైనా ఆక్రమించలేదని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు.

Updated : 09 Apr 2024 18:59 IST

దిస్పుర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హయాంలో భారత భూభాగంలో ఒక్క అంగుళాన్నీ చైనా (China) ఆక్రమించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ‘బై-బై’ చెప్పిన తీరును ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా అస్సాంలోని లఖింపుర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బంగ్లాదేశ్‌తో దేశ సరిహద్దును కట్టుదిట్టం చేసిన తమ ప్రభుత్వం చొరబాట్లను అరికట్టిందని చెప్పారు.

మన దేశం బలంగా ఉంటేనే.. ప్రపంచం మాట వింటుంది : ప్రధాని మోదీ

‘‘1962లో చైనా దురాక్రమణ వేళ అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లను నెహ్రూ పట్టించుకోలేదు. ఇప్పుడు మన భూమిలో ఒక్క అంగుళాన్ని ఆ దేశం ఆక్రమించలేకపోయింది. డోక్లామ్‌లో కూడా వారిని తరిమికొట్టాం. గతంలో కాంగ్రెస్‌ పాలకులు అస్సాంకు అన్యాయం చేశారు. వివిధ హింసాత్మక ఆందోళనలు, తిరుగుబాటు సంబంధిత ఘటనల్లో అనేకమంది మృతి చెందారు. కానీ.. గత పదేళ్లలో శాంతి ఒప్పందాలు కుదిరాయి. తొమ్మిది వేలమంది ఆందోళనకారులు లొంగిపోయారు. రాష్ట్రంలోని 80 శాతం ప్రాంతాల నుంచి సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) ఉపసంహరించుకున్నాం’’ అని షా తెలిపారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలే కీలకమని పేర్కొన్న ఆయన.. ఇక్కడి అన్ని స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులకు విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు