Kejriwal: స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటన.. తొలిసారి స్పందించిన కేజ్రీవాల్‌

ఆప్‌ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి జరిగిన ఘటనపై ఆ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తొలిసారి స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. 

Published : 22 May 2024 20:45 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal)పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్‌ దాడి చేసిన ఘటన ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేజ్రీవాల్‌ బుధవారం తొలిసారి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగడంతో పాటు ఆమెకు న్యాయం అందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

‘‘ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నా. న్యాయం జరగాలి. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయి. ఇద్దరి నుంచి నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందుతుంది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున.. ఏమీ మాట్లాడలేను’’ అని పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

నా వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు: స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు

సీఎం కేజ్రీవాల్‌ నివాసంలోని డ్రాయింగ్‌ రూంలో ఎదురుచూస్తున్న స్వాతితో.. బిభవ్‌కుమార్ అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో బిభవ్‌ను అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు నిందితుడిని ముంబయికి తీసుకెళ్లారు. స్వాధీనం చేసుకున్న నిందితుడి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సీసీటీవీ రికార్డులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని స్వాతి మాలీవాల్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఇలా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని