Eknath Shinde: ‘బిష్ణోయ్‌ అంతు చూస్తాం’.. సల్మాన్‌ను కలిసిన సీఎం శిందే

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ ఖాన్‌ నివాసంపై కాల్పుల ఘటనపై సీఎం ఏక్‌నాథ్‌ శిందే స్పందించారు. సల్మాన్‌ను కలిసి ధైర్యం చెప్పారు.

Published : 16 Apr 2024 19:34 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)ఇంటిపై కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) మంగళవారం మధ్యాహ్నం సల్మాన్‌ను కలిశారు. ముంబయిలో బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌కు సీఎం రాకతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. ఇప్పటికే నిందితులు అరెస్టయ్యారు. విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో హస్తం ఉన్న ఎవరినీ వదిలిపెట్టం’’ అని సల్మాన్‌కు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో గ్యాంగ్ వార్‌లను అనుమతించబోమని, వారి అంతు చూస్తామని (లారెన్స్‌ను ఉద్దేశిస్తూ) అన్నారు. 

సల్మాన్‌ ఇంటిపై కాల్పులు: విదేశాల్లో కుట్ర.. ముంబయిలో అమలు

ఆదివారం తెల్లవారుజామున సల్మాన్‌ఖాన్‌ నివాసంపై పలుమార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చిలో సల్మాన్‌ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈమెయిల్స్‌ రావడంతో గ్యాంగ్‌స్టర్లు లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీ బ్రార్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తాజాగా గుజరాత్‌లోని భుజ్‌ జిల్లాలో షూటర్లు వికాస్‌గుప్తా, సాగర్‌పాల్‌లను అరెస్టు చేశారు. ఈ ఘటనతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు సంబంధమున్నట్లు నిందితులు అంగీకరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని