Karnataka Politics: సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు.

Published : 22 May 2024 00:07 IST

బెంగళూరు: సొంత పార్టీలో వైరుధ్యాల కారణంగా కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో జరిగేది ఇదేనన్నారు. అధికార పార్టీలో అంతర్గత విభేదాలతోపాటు పలు విషయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొందన్నారు. జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్‌లో చీలిక ఖాయమని, దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపైనా ఉంటుందన్నారు.

‘‘లోక్‌సభ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు భారీ సంఖ్యలో ఓట్లు రాకుంటే తాను పదవిలో కొనసాగడం కష్టమేనని సీఎం చెప్పారు. మరోవైపు.. తాను ముఖ్యమంత్రి అవుతానని కాంగ్రెస్‌కు ఓటు వేశారని.. కానీ, నిరాశ చెందారని డిప్యూటీ సీఎం ప్రజలతో చెబుతున్నారు. రానున్న రోజుల్లో వారి కల సాకారమవుతుందని పేర్కొంటున్నారు’ అని బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు.

MK Stalin: రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్‌

‘‘సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది. మోదీ మూడోసారి ప్రధాని అయిన కొన్ని నెలలకే జాతీయస్థాయిలో భారీ మార్పులు వస్తాయి. కాంగ్రెస్‌ నిలువునా చీలినా ఆశ్చర్యం లేదు. దాని ప్రభావం కర్ణాటకపైనా ఉంటుంది. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన మంత్రులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వారి తరఫున వారి పిల్లలను బరిలో దించారు. ప్రభుత్వంలో పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. వీటితోపాటు పార్టీలో అనేక విషయాల్లో అంతర్గత విభేదాలున్నాయి. ఎన్నికలు ఉన్నందున వాటికి కాస్త విరామం ఇచ్చారు. ఫలితాలు వెలువడిన వెంటనే మళ్లీ మొదలవుతాయి’ అని కర్ణాటక మాజీ సీఎం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు