Congress: మోదీకి అమిత్‌షా హింట్‌ ఇస్తున్నారా..?: ‘రిటైర్మెంట్‌’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్‌

తన మాటల ద్వారా రిటైర్మెంట్‌ గురించి ప్రధాని మోదీ (Modi)కి అమిత్‌ షా(Amit Shah) హింట్‌ ఇస్తున్నారా..? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. 

Updated : 22 May 2024 14:16 IST

(పాతచిత్రం)

దిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు వయసు మీదపడుతోందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ కౌంటర్ ఇచ్చింది. నిజానికి ఆయన మోదీ (Modi)కి సంకేతాలిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ప్రధాని పీఠాన్ని దక్కించుకొనేందుకు ఈ భాజపా నేత ఆసక్తిగా ఉన్నారని వ్యాఖ్యానించింది.

ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘‘నవీన్‌కు ఇప్పుడు 77 సంవత్సరాలు. వయసు మీదపడుతుండటమే కాకుండా.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన రిటైర్ అవ్వాలి’’ అని ఎద్దేవా చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు. ‘‘వయసు కారణంగా పట్నాయక్‌ రిటైర్ అవ్వాలని అని అమిత్‌ షా అన్నారు. ఒకవేళ భాజపా అధికారంలోకి వస్తే.. మోదీకి ఆయన ఇస్తున్న సూచనా ఇది..? కమలం పార్టీ అధికారంలోకి రాకపోతే.. ఆయనే అత్యంత సంతోషించే వ్యక్తి అనిపిస్తోంది. అప్పుడు మోదీ కాకుండా ఆయనే సభలో ప్రతిపక్ష నేత స్థానంలో కూర్చునేలా ఉన్నారు’’ అని పోస్టు చేశారు.

అదృశ్యమైన బంగ్లాదేశ్ ఎంపీ మృతదేహం కోల్‌కతాలో గుర్తింపు.. హత్యగా అనుమానాలు!

ప్రస్తుతం మోదీ వయసు 73 సంవత్సరాలు. భాజపాలో ‘75 ఏళ్ల వయసు నిబంధన’ ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించి ఇటీవల దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇతర విపక్ష నేతలు ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నారు. మోదీ పదవీ విరమణ చేస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. అమిత్‌షాను ప్రధాని పదవిలో కూర్చోబెట్టేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారని కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని