LS Polls: ఆ రెండు రాష్ట్రాల్లో ‘ఇండియా’ కూటమిదే హవా.. : చిదంబరం

2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్‌కు మరిన్ని సీట్లు వస్తాయని పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం ధీమా వ్యక్తం చేశారు.

Published : 13 Apr 2024 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) మెరుగైన ఫలితాలే లక్ష్యంగా కాంగ్రెస్‌ (Congress) తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 2019తో పోలిస్తే ఈసారి తమకు మరిన్ని సీట్లు వస్తాయని పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం (Chidambaram) ధీమా వ్యక్తంచేశారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళనాడు, కేరళల్లో ‘ఇండియా’ కూటమి ఘన విజయం సాధిస్తుందని, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, దిల్లీల్లోనూ పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ‘కచ్చతీవు’ ఓ ముగిసిన అధ్యాయమని.. ఓట్ల రాజకీయాలు, చైనా దురాక్రమణపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ఆరోపించారు.

చక్కెర నాడు తీపి.. కుమారకా? చంద్రుడికా..?

ఈ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కీలక వ్యక్తిగా పేర్కొన్న చిదంబరం.. సొంత రాష్ట్రంపై పట్టు నిలుపుకోవడంలో ఆమె సామర్థ్యం ‘ఇండియా’ కూటమిని బలోపేతం చేస్తుందన్నారు. ‘‘అన్ని రాష్ట్రాల గురించి చెప్పలేను. కానీ, తమిళనాడులో మా కూటమి సత్తా చాటుతుంది. కేరళలో యూడీఎఫ్‌, ఎల్డీఎఫ్‌ల జోరులో భాజపా కొట్టుకుపోతుంది. తెలంగాణ, కర్ణాటకల్లోనూ పైచేయి సాధిస్తాం. 2019 ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటాం’’ అని తెలిపారు. 2019 ఎన్నికల్లో హస్తం పార్టీకి 52 సీట్లు వచ్చాయి. ప్రధాని మోదీని హిందూ రక్షకుడిగా చూపించేందుకుగానూ ప్రతిపక్షాలపై హిందూ వ్యతిరేకి అని ముద్ర వేయడం భాజపా వ్యూహంలో భాగమని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని