Adani issue: అదానీ వ్యవహారం.. విదేశాంగ శాఖ చెప్పింది కరెక్టే: కాంగ్రెస్‌ వ్యంగ్యాస్త్రాలు

Eenadu icon
By National News Team Published : 30 Nov 2024 12:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: అదానీ, దాని అనుబంధ సంస్థలు.. సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు పెద్దఎత్తున లంచాలు ఆఫర్‌ చేశారన్న ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదవడం ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై (Adani issue) భారత విదేశాంగ శాఖ నుంచి వచ్చిన స్పందనపై కాంగ్రెస్ (Congress) విమర్శలు చేసింది.

గురువారం విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్‌ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘ఇది ప్రైవేటు సంస్థలు, కొంతమంది వ్యక్తులు, అమెరికా న్యాయశాఖకు సంబంధించిన అంశం. ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన విధానాలు, చట్టపరమైన మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. అవి వాటిని అనుసరిస్తాయని విశ్వసిస్తున్నాం. ఇప్పటివరకు భారత సర్కారుకు ఎటువంటి సంబంధం లేని ఈ అంశంపై అమెరికా ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపలేదు’’ అని తెలిపారు. అలాగే అదానీ కేసులో భారత్‌కు అమెరికా సమన్లు లేదా వారెంటు ఇచ్చిందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. భారత్‌కు అటువంటి విజ్ఞప్తి ఏదీ రాలేదన్నారు.

దీనిపై కాంగ్రెస్‌ నాయకులు స్పందించారు. ‘‘అదానీ గ్రూప్‌ వ్యవహారంలో అమెరికా దర్యాప్తులో భారత ప్రభుత్వం భాగం కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రభుత్వం తనకు తాను దర్యాప్తులో ఎలా భాగం అవుతుందిలే..?’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రభుత్వంపైనే విమర్శలు వచ్చాయనే ఉద్దేశంలో ఈ విమర్శలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు