Karnataka: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర : డిప్యూటీ సీఎం శివకుమార్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్రం బయట కుట్ర జరుగుతోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పేర్కొన్నారు.

Published : 24 Jul 2023 20:20 IST

బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ (Karnataka Assembly) ఎన్నికల్లో భాజపాను ఓడించి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్రం బయట కుట్ర జరుగుతోందని అన్నారు.

‘ఏం జరుగుతుందో చూద్దాం. మా దగ్గర కూడా నిర్దిష్టమైన సమాచారం ఉంది. అది వాళ్ల (భాజపా) వ్యూహం. బెంగళూరులో చేయడానికి బదులు.. వాళ్లు బయట ఈ కుట్రలు చేస్తున్నారు’ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని వస్తోన్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీకే ఈ విధంగా స్పందించారు.

‘నెలసరి శుభ్రత’పై పాలసీ ఆలస్యం.. రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్‌

డీకే చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ కూడా సమర్థించారు. ‘వాళ్లు (భాజపా) ఎన్నో ప్రభుత్వాలను పడగొట్టారు. అందుకే మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్లకు మంచి, చెడు అనే తేడా ఏమీ లేదు. వాళ్లు చేస్తున్న అప్రజాస్వామిక పోకడలు మనకు తెలిసినవే. డీకే శివ కుమార్‌కు దీనిపై మరింత సమాచారం ఉండి ఉండొచ్చు’ అని బైరెగౌడ పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన.. ప్రభుత్వాలను కూల్చడంలో ఎంతో ప్రసిద్ధి పొందిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని