హత్యకేసులో.. ప్రముఖ నటుడు అరెస్టు

హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌(Darshan)ను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated : 11 Jun 2024 15:24 IST

బెంగళూరు: ఒక హత్యకేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప(Darshan Thugadeepa)ను అరెస్టయ్యారు. మంగళవారం మైసూరులో ఆయనతో పాటు మరో పదిమందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్‌ 8న రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా నిందితుడు దర్శన్‌ పేరు వెల్లడించారని చెప్పారు. అతడితో నటుడు నిరంతరం టచ్‌లో ఉండేవాడని తెలుస్తోంది. దాంతో దర్యాప్తు నిమిత్తం ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. మృతుడు ఒక సినీనటికి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు తెలిసింది. ఆ నటిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆర్‌ఆర్‌ నగర్‌లోని దర్శన్‌ ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. 2002లో మాజెస్టిక్‌ చిత్రంతో కథానాయకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టిన ఆయన.. తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షాకాదరణ సొంతం చేసుకున్నారు. గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు