Medha Patkar: పరువు నష్టం కేసు.. దోషిగా తేలిన మేధా పాట్కర్‌

పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్‌’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను దిల్లీ కోర్టు దోషిగా తేల్చింది.

Updated : 24 May 2024 20:40 IST

దిల్లీ: పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్‌’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ (Medha Patkar)ను దిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. 2000 నాటికి చెందిన ఈ కేసును ప్రస్తుతం దిల్లీ ఎల్‌జీగా ఉన్న వీకే సక్సేనా (VK Saxena) దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ ఈమేరకు తీర్పు వెలువరించారు. ఈ కేసులో దోషిగా తేలినవారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

మేధా పాట్కర్‌, వీకే సక్సేనాల మధ్య 2000 సంవత్సరం నుంచి న్యాయపోరాటం సాగుతోంది. తనతోపాటు నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై వీకే సక్సేనాపై ఆమె అప్పట్లో కేసు వేశారు. ఆ సమయంలో ఆయన అహ్మదాబాద్‌ కేంద్రంగా ఉన్న ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. మరోవైపు.. ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై ఆయన సైతం రెండు కేసులు దాఖలు చేశారు.

అది ఒకప్పుడు మా దేశమే అని చెప్పా..: పాక్‌ పర్యటనపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

గుజరాత్‌లో నర్మదా నదిపై ‘సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌’ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మేధా పాట్కర్‌ ‘నర్మదా బచావో ఆందోళన్‌’ చేపట్టారు. ఈ డ్యామ్‌ కారణంగా 40 వేల కుటుంబాలు ఇళ్లను కోల్పోతాయని పేర్కొంటూ.. పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. 1961లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసినప్పటి నుంచి వివాదాల్లో చిక్కుకున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు 2017లో అందుబాటులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని