Amit Shah: అమిత్‌ షా ‘వీడియో సోర్స్‌’పై పోలీసుల దృష్టి.. సోషల్‌ మీడియా సంస్థలకు లేఖ

అమిత్‌ షా వీడియో ‘మూలాలను’ తెలుసుకునేందుకు ఎక్స్‌ (Twitter)తోపాటు ఇతర సోషల్‌ మీడియా సంస్థలకు దిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Published : 29 Apr 2024 18:27 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన కేంద్ర హోంమంత్రి అమిషా (Amit Shah) వీడియో కేసులో దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వీడియో ‘మూలాలను’ తెలుసుకునేందుకు ఎక్స్‌ (Twitter)తోపాటు ఇతర సోషల్‌ మీడియా సంస్థలకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇదే కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు.

ఓ వర్గానికి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కట్టుబడి ఉన్నామంటూ అమిత్‌ షా చెప్పినట్లు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవ వీడియోను మార్ఫింగ్‌ చేసినట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ గుర్తించింది. దీనిపై దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ క్రమంలోనే ఆ వీడియో ఎవరు వ్యాప్తి చేశారు, మూలం ఎక్కడినుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు స్పెషల్‌ సెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండర్‌ స్ట్రాటెజిక్‌ ఆపరేషన్స్‌ (IFSO) విభాగం.. సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాచారాన్ని కోరింది.

అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసు.. పలువురు కాంగ్రెస్‌ నాయకులకు నోటీసులు

‘ఈ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, దీనికి కారకులను అరెస్టు చేసేందుకు అనేక బృందాలు ఏర్పాటుచేశాం. ఎక్స్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల సంస్థలకు లేఖ రాశాం. సోర్స్‌తోపాటు దీని వ్యాప్తికి బాధ్యులైన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశాం’ అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని