Diamonds: నూడుల్స్‌లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!

నూడుల్స్‌లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. 

Updated : 23 Apr 2024 19:34 IST

ముంబయి: వజ్రాలను అక్రమంగా విదేశాలకు రవాణా చేసేందుకు కొందరు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. రూ.కోట్ల విలువైన డైమండ్స్‌ను నూడుల్స్‌ ప్యాకెట్లలో దాచి అధికారుల కళ్లు గప్పి బ్యాంకాక్‌కు తరలించే ప్రయత్నం చేశారు కొందరు ప్రయాణికులు. వారిని కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

నూడుల్స్‌ ప్యాకెట్లలో ఏర్పాటుచేసిన వజ్రాలను ముంబయి ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. ప్రయాణికుల నుంచి రూ.6 కోట్లకు పైగా విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. దీనిలో రూ.4 కోట్లకు పైగా విలువైన బంగారం, రూ.2 కోట్లకు పైగా విలువైన వజ్రాలున్నాయి. ఆ నలుగురు ప్రయాణికులను అధికారులు అరెస్టు చేశారు.

అంకుల్‌.. మా బడిని ఇలా చేశారేంటి?

మరోవైపు.. శ్రీలంక నుంచి ముంబయికి వచ్చిన ఓ ప్రయాణికురాలి నుంచి 300 గ్రాములకు పైగా బంగారపు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి ఆమె తన లోదుస్తుల్లో దాచి అక్రమ రవాణాకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్‌, బ్యాంకాక్‌, సింగపూర్‌ ఇలా ఆయా దేశాలకు ప్రయాణించే 10 మంది భారతీయుల నుంచి దాదాపు రూ.4 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని