Viksit Bharat: ‘వాట్సప్‌లో వికసిత భారత్‌ సందేశాలు ఆపండి’: కేంద్రానికి ఈసీ ఆదేశం

‘వికసిత భారత్‌’ పేరిట వాట్సప్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి సందేశాలు వస్తున్న సంగతి తెలిసిందే. వెంటనే వాటిని ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Updated : 21 Mar 2024 14:12 IST

దిల్లీ: వాట్సప్‌లో ‘వికసిత భారత్’ సందేశాలను పంపడం వెంటనే ఆపివేయాలంటూ కేంద్రాన్ని ఎన్నికల సంఘం (ECI) ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఐటీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ‘పారదర్శకతను నిర్ధరించేందుకు మేం తీసుకుంటున్న చర్యలో ఇదొక భాగం’ అని ఎన్నికల సంఘం వెల్లడించింది.

‘ఇప్పుడు చట్టాన్ని ఆపితే గందరగోళమే’.. ఈసీల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ

కొద్దిగంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ప్రధాని మోదీ లేఖతో ఉన్న వాట్సప్‌ సందేశాలను కేంద్రం పంపింది. ‘వికసిత భారత్ సంపర్క్‌’ పేరిట అవి వస్తున్నాయి. నెట్‌వర్క్‌ పరిమితుల కారణంగా మార్చి 16న పంపిన సందేశాలు కొందరికి ఆలస్యంగా డెలివరీ అవుతున్నాయని ఈసీకి ఐటీ శాఖ వెల్లడించింది. 

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసే మెసేజ్‌లు వస్తున్నాయని ఈసీకి ఫిర్యాదులు అందాయి. కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలోనే ఈసీ నుంచి తాజా స్పందన వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని