ECI: బెంగాల్‌ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు

ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

Published : 18 Mar 2024 15:14 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ.. ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం (Election Commission) కొరడా ఝళిపించింది. గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదేవిధంగా పశ్చిమబెంగాల్‌ డీజీపీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది.

ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్‌బీఐకి సుప్రీం డెడ్‌లైన్‌

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఎన్నికల సంఘం ఈమేరకు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. బృహన్‌ముంబయి మున్సిపల్‌ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ చాహల్‌తోపాటు అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లపైనా వేటు పడింది. మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌ల సాధారణ పరిపాలనా విభాగాల కార్యదర్శులను కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని