LS polls: హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సుర్జేవాలాపై ఈసీ చర్యలు

హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలాపై 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం (Election Commission) నిషేధం విధించింది.

Published : 17 Apr 2024 00:06 IST

దిల్లీ: ప్రముఖ నటి, మథుర ఎంపీ హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలాపై ఎన్నికల సంఘం (Election Commission) చర్యలు తీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈసీ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి.

మార్చి 31న కురుక్షేత్ర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సుర్జేవాలా.. హేమామాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి భాజపా ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’లో ఓ వీడియోను పోస్టు చేశారు. మహిళలను అగౌరవపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

లోక్‌సభ ఎన్నికల వేళ.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

సుర్జేవాలాపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇందుకు బదులిచ్చిన కాంగ్రెస్‌ నేత.. తన వ్యాఖ్యలను భాజపా వక్రీకరించే యత్నం చేస్తోందని చెప్పారు. ఆయన ఇచ్చిన వివరణను ఈసీ తోసిపుచ్చింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వీడియో తమ బృందం చిత్రీకరించిందని, అందులో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలిందని చెప్పింది. ఈ క్రమంలోనే చర్యలకు ఉపక్రమించిన ఈసీ.. రెండు రోజుల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని