Durgesh Pathak: ఆతిశీ చెప్పిన ఆ నలుగురిలో ఒకరికి ఈడీ సమన్లు

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాథక్‌ (Durgesh Pathak)కు తాజాగా దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు ఇచ్చింది. 

Published : 08 Apr 2024 14:43 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు తనతో పాటు మరో ముగ్గురు నేతలు అరెస్టు అవుతారంటూ ఆప్‌ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నలుగురిలో ఒకరైన దుర్గేశ్‌ పాథక్‌ (Durgesh Pathak)కు దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సోమవారం ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు మధ్యాహ్నమే హాజరుకావాలని వాటిల్లో పేర్కొంది. అదే సమయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు(పీఏ)ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. కొన్ని దస్త్రాలకు సంబంధించి స్పష్టత కోసం ఆయన్ను విచారించినట్లు సమాచారం.

గత నెల అరెస్టయిన కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) విచారణలో కీలక విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితుడైన విజయ్‌ నాయర్‌ (Vijay Nair) తన మంత్రి వర్గంలోని ఆతిశీ, సౌరభ్‌కు రిపోర్టు చేసేవాడని సీఎం పేర్కొన్నట్లు ఏఎస్‌జీ ఎస్‌వీ రాజు కోర్టుకు వెల్లడించారు. తమ పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.  ‘‘నాతో పాటు సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేశ్‌ పాథక్‌, రాఘవ్‌ చద్దా త్వరలో అరెస్టవుతారు’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా పాథక్‌కు నోటీసులు వచ్చాయి. ఆయన రాజిందర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే.

త్వరలో మేం నలుగురం జైలుకు.. ఆతిశీ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. అక్కడి నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఈ కేసులోనే అరెస్టయిన సంజయ్‌సింగ్‌.. ఆరు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని