EC: సాక్ష్యాలు సమర్పించండి.. లేదంటే..: జైరాం రమేష్‌కు ఈసీ హెచ్చరిక

కేంద్రమంత్రి అమిత్‌ షాపై తాను చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాలను సమర్పించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చేసిన అభ్యర్థనను ఈసీ తిరస్కరించింది.

Updated : 03 Jun 2024 18:21 IST

దిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah)పై చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాలను చూపేందుకు మరికొన్ని రోజుల గడువు కావాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) చేసిన విజ్ఞప్తిని ఎన్నికల సంఘం (EC) తిరస్కరించింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను చూపించి తీరాలని స్పష్టం చేసింది. అందుకు నేటి సాయంత్రం 7 గంటలకు వరకు డెడ్‌లైన్‌ విధించింది. లేదంటే తగు చర్యలు తప్పవని హెచ్చరించింది.

‘‘బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు ఈ విధంగా ఆరోపణలు చేయడం ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తాయి. వాటిపై విచారణ జరిపేందుకు ఆదివారం వరకు తగిన ఆధారాలు సమర్పించాలి’’ అని పేర్కొంటూ ఎన్నికల సంఘం జైరాం రమేశ్‌కు నోటీసులు పంపించింది. ఆదివారం సాయంత్రం లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, ఆధారాలను సమర్పించేందుకు తనకు వారం రోజుల వ్యవధి కావాలని జైరాం రమేశ్‌ ఈసీకి విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌ నేత చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన ఈసీ.. ఎట్టి పరిస్థితుల్లో అదనపు సమయం ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. నేటి సాయంత్రం 7 గంటలలోగా ఆధారాలను సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

భార్య గెలవాలని.. హీరో పొర్లు దండాలు: వీడియో వైరల్‌

‘‘లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముందు కేంద్రమంత్రి అమిత్‌ షా ఇప్పటివరకు 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై నిఘా పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. విజయం పట్ల కాషాయ పార్టీకి ఆందోళన పట్టుకుంది. ఆ పార్టీ నిరాశలో ఉందని దీని ద్వారా స్పష్టం అవుతుంది. ఏది ఏమైనా ఇండియా కూటమి విజయం సాధిస్తుంది’’ అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా జైరాం రమేశ్‌ చేసిన పోస్టుపై ఈసీ తీవ్రంగా పరిగణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని