Election Commission: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీలకు ఉప ఎన్నికలు.. జులై 10న పోలింగ్‌

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Published : 10 Jun 2024 16:33 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన రోజుల వ్యవధిలోనే మరోసారి ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం (Election Commission) సిద్ధమైంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై 10న ఉప ఎన్నికలు (Bypolls) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 10చోట్ల ఎమ్మెల్యేల రాజీనామాలు, మూడుచోట్ల ప్రజాప్రతినిధుల మృతితో బైపోల్స్‌ అనివార్యమయ్యాయి. జులై 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిఉందని ఈసీ వెల్లడించింది.

బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలి సంతకం దీనిపైనే..?

రుపౌలీ (బిహార్‌), రాయ్‌గంజ్‌, రాణాఘాట్‌ దక్షిణ్‌, బాగ్దా, మానిక్‌తలా (పశ్చిమ బెంగాల్‌), విక్రవాండీ (తమిళనాడు), అమర్‌వాడా (మధ్యప్రదేశ్‌), బద్రీనాథ్‌, మంగ్లౌర్‌ (ఉత్తరాఖండ్‌), జలంధర్‌ వెస్ట్‌ (పంజాబ్‌), డెహ్రా, హమీర్‌పుర్‌, నాలాగఢ్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మానిక్‌తాలా, విక్రవాండీ, మంగ్లౌర్‌ స్థానాల్లో ఎమ్మెల్యేలు మృతిచెందగా.. మిగతాచోట్ల రాజీనామా చేశారు.

షెడ్యూల్‌ వివరాలిలా..

  • నోటిఫికేషన్‌ విడుదల: జూన్‌ 14
  • నామినేషన్లకు చివరి తేదీ: జూన్‌ 21
  • నామినేషన్ల పరిశీలన: జూన్‌ 24
  • ఉపసంహరణ గడువు: జూన్‌ 26
  • పోలింగ్‌ తేదీ: జులై 10
  • ఓట్ల లెక్కింపు: జులై 13
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు