India-USA: ‘ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు’: భారత్‌-అమెరికా రిలేషన్‌షిప్‌పై గార్సెట్టి వ్యాఖ్య

భారత్‌-అమెరికా(India-USA) కలిసి ఉండటానికి చైనా కారణం కాదని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వివరించారు. 95 శాతం ఇతర కారణాలతోనే ఇరుదేశాల మధ్య సంబంధాలు విస్తరిస్తున్నాయని చెప్పారు. 

Updated : 07 Dec 2023 11:00 IST

దిల్లీ: భారత్‌-అమెరికా(India-USA) బంధం ప్రపంచానికి మేలు చేస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వ్యాఖ్యానించారు. అలాగే రెండు దేశాల బంధాన్ని రొమాంటిక్ రిలేషన్‌షిప్‌గా అభివర్ణించారు. ప్రస్తుతం వీరిద్దరు(భారత్‌-అమెరికా) డేటింగ్‌లోనే ఉన్నారని చమత్కరించారు. 

‘ఈ ఇద్దరి బంధం చాలాకాలం పాటు సంక్లిష్టంగానే కొనసాగింది. కానీ, ఇప్పుడు మాత్రం డేటింగ్‌లో ఉన్నారు. కాలక్రమేణా ఒకరి అలవాట్లు మరొకరు  గ్రహిస్తారు. ప్రస్తుతం ఈ బంధం ఎంత దూరం ప్రయాణించగలదో అంచనావేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, దానిపై కాస్త సందిగ్ధత ఉంది. కానీ వీరిద్దరు కలిసి ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అది వ్యక్తిగతమైనది. భారత్‌-అమెరికా(India-USA) కలిసి ఉండటానికి చైనా(China) కారణం అని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆ వాదనపై నాకు అస్సలు నమ్మకం లేదు. ఈ బంధానికి 95 శాతం ఇతర కారణాలున్నాయి’ అని గార్సెట్టి భారత్-అమెరికా బంధంపై వ్యాఖ్యానించారు. 

ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో భారతీయుడి మృతి

అలాగే రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఇప్పటికీ పరస్పర వ్యాపారం తగిన స్థాయిలో లేదన్నారు. భారత్‌తో జరుపుతున్న వ్యాపారం విలువ అమెరికా ఆర్థిక వ్యవస్థలో రెండు శాతానికి మాత్రమే సమానమన్నారు. ఆశించిన స్థాయిలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం లేదని అభిప్రాయపడ్డారు. కాగా, కొద్దినెలల క్రితం ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన రెండు దేశాల మధ్య పెరుగుతోన్న బంధానికి నిదర్శనమని గార్సెట్టి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని