Gautam Adani: జీత్‌ వెనుక నిజమైన శక్తి ఎవరంటే? : గౌతమ్‌ అదానీ

Eenadu icon
By National News Team Published : 13 Feb 2025 00:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani) చిన్న కుమారుడు జీత్‌ అదానీ (Jeet Adani), దివా జైమిన్‌ షా (Diva Jaimin Shah)ల వివాహం ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో గౌతమ్‌ అదానీ భావోద్వేగ ప్రసంగం చేశారు. జీత్‌ అదానీ- ప్రీతి అదానీ (Preeti Adani) మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని గురించి ఆయన వివరించారు. 

‘‘జీత్‌- దివా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇవి కేవలం మాకు ఆనంద క్షణాలు మాత్రమే కాదు. ఎంతో మంది పేదల జీవితాలను మార్చే కార్యక్రమాలకు నాంది పలుకుతోంది. వీరిద్దరూ జీవితాంతం దాతృత్వం, బాధ్యతలను పంచుకుంటూ గడపాలి’’ అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన సతీమణి ప్రీతి అదానీ గురించి ప్రస్తావిస్తూ.. ఆమెను కొనియాడారు.

అమ్మ నీ వెంటే..

‘‘ఒక మహిళ బిడ్డకు జన్మనివ్వడం మాత్రమే కాకుండా.. తన చిన్నారి కలల కోసం ఏకంగా ఆమె జీవితాన్ని అంకితం చేస్తుందనడంలో సందేహం లేదు. జీత్ అదానీ వెనుక ఉన్న నిజమైన శక్తి అతడి తల్లి ప్రీతి అదానీ. ఆమె ప్రేమే అతడిని మార్గనిర్దేశం చేస్తూ ముందుకు నడిపించింది. నువ్వు (కుమారుడిని ఉద్దేశిస్తూ) జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నావ్. మీరు వేసిన ప్రతీ అడుగు ఆమె పంచిన ప్రేమ, త్యాగాల ఫలితమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకో. ఆమె మీకు బలం. క్లిష్ట పరిస్థితులోనూ ‘అమ్మ’ మీ వెంట ఉంటుంది’’ అని గౌతమ్‌ అదానీ అన్నారు.  

కాగా.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్‌ షా కుమార్తె దివాతో.. జీత్‌ అదానీ వివాహం ఫిబ్రవరి 7న వైభవంగా జరిగింది. ఈ వేడుక సందర్భంగా అదానీ కుటుంబం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏటా 500 మంది దివ్యాంగ సోదరీమణులకు వివాహం నిమిత్తం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ ప్రయత్నం ద్వారా దివ్యాంగులైన ఆడబిడ్డలు, వారి కుటుంబాలు ఆనందం, గౌరవంతో ముందుకుసాగుతాయనే నమ్మకం కలుగుతోందంటూ గౌతమ్ అదానీ తన పోస్టులో ఇటీవల హర్షం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు