Drugs trafficking: నిర్మాతపై డ్రగ్‌ కేసు.. రూ.40 కోట్లు ఏం చేశాడంటే?

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన తమిళ సినీ నిర్మాత జాఫర్‌ సాదిక్‌ రూ.40 కోట్లను సినీ నిర్మాణం, ఇతర వ్యాపారాలకు వినియోగించినట్లు ఈడీ ఆరోపించింది.

Published : 13 Apr 2024 19:29 IST

దిల్లీ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్‌ సాదిక్‌ (Jaffer Sadiq) రూ.కోట్లను చిత్ర పరిశ్రమ, ఇతర వ్యాపారాలకు వినియోగించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఆరోపించింది. ఏప్రిల్‌ 9న చెన్నై, మదురై, తిరుచురాపల్లిలో ఫెడరల్‌ ఏజెన్సీ జరిపిన దాడుల ఆధారంగా ఈడీ శనివారం ఈ ప్రకటనను విడుదల చేసింది.

డ్రగ్స్‌ అక్రమ రవాణా ద్వారా ఆర్జించిన రూ.40 కోట్లను జాఫర్‌ చిత్ర నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాల్లోకి మళ్లించినట్లు పేర్కొంది. వీటిలో రూ.6 కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు చెల్లింపులు జరిపినట్లు తెలిపింది. రూ.12 కోట్లకు పైగా సినీ నిర్మాణంలో.. రూ.21 కోట్లను బ్యాంకు ఖాతాల్లో గుర్తించినట్లు ఈడీ వివరించింది. స్థిరాస్తుల కోసం ఎక్కువ మొత్తంలో వినియోగించినట్లు పేర్కొంది.

ఉగ్రవాదులకు రూల్స్‌ ఉండవు.. ప్రతిస్పందన కూడా అలాగే..!: జైశంకర్‌

దీనికి సంబంధించిన పత్రాలు తమవద్ద ఉన్నాయంటూ ఈడీ వెల్లడించింది. రూ.2వేల కోట్ల డ్రగ్స్‌ స్మగ్లింగ్‌లో మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కోలీవుడ్‌లో నాలుగు సినిమాలు నిర్మించిన జాఫర్‌ సాదిక్‌.. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నాడు. డీఎంకే ఎన్‌ఆర్‌ఐ విభాగానికి ఆఫీస్‌ బేరర్‌గా పని చేశాడు. అయితే, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో డీఎంకే అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. పరారీలో ఉన్న జాఫర్‌ను మార్చిలో ఎన్‌సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు