FSSAI: తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు..: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరిక

తల్లి పాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) తాజాగా వెల్లడించింది.

Published : 26 May 2024 20:12 IST

దిల్లీ: తల్లి పాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI)’ హెచ్చరించింది. FSS 2006 చట్టం ప్రకారం తల్లి పాలను విక్రయించడానికి అనుమతి లేదని, వాటిని ఉపయోగించి చేస్తోన్న వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తల్లి పాలను ప్రాసెస్ చేసి, విక్రయించేందుకు యత్నించే వ్యాపారులకు లైసెన్సులు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది

పాలిచ్చే తల్లుల నుంచి పాలను సేకరించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం పాల బ్యాంకులను నిర్వహిస్తోందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. అవసరంలో ఉన్న చిన్నారులకు వాటిని అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం ఆన్‌లైన్‌లో తల్లి పాలను విక్రయిస్తున్న ఘటనలు ఈ మధ్య అధికంగా వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

పాల బ్యాంకులు సాధారణంగా ఆరోగ్యకరమైన దాతల నుంచి సేకరించిన పాలను ప్రాసెస్ చేస్తాయి. వాటిని నిల్వ చేయడానికి ముందు అధికారులు పోషక పదార్థాలను తనిఖీ చేస్తారు. ఇలా నిల్వ చేసిన పాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన శిశువులకు ఉచితంగా అందిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని