Congress: పార్లమెంటు ప్రాంగణంలో మహనీయుల విగ్రహాల తరలింపు.. మండిపడ్డ కాంగ్రెస్‌

పార్లమెంటు ప్రాంగణంలోని మహనీయుల విగ్రహాలను వాటి స్థానాల నుంచి వేరే చోటుకు తరలించడంపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. 

Published : 06 Jun 2024 20:56 IST

దిల్లీ: పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉన్న మహనీయుల విగ్రహాలను వేరే చోటుకు తరలించడం వివాదాస్పదమయ్యింది. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ వంటి విగ్రహాలు ఉండటంతో దీనిపై కాంగ్రెస్‌ పార్టీ (Congress)తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వాటిని అక్కడినుంచి తొలగించడంతో భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే, త్వరలో లోక్‌సభ సమావేశం కానున్న నేపథ్యంలో అక్కడ చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా వాటిని పాత పార్లమెంట్‌ సమీపంలోని పార్కుకు తరలించినట్లు సమాచారం.

కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేవారు

‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌, మహాత్మాగాంధీ, డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను ఏర్పాటుచేసిన ప్రదేశం నుంచి తొలగించారు. ఇది చాలా దారుణం’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా భాజపాపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా స్పందిస్తూ.. ఒకవేళ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా సాధిస్తే.. కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేవారని ఆరోపించారు.

షాకింగ్‌.. కంగనను చెంపదెబ్బ కొట్టిన CISF కానిస్టేబుల్‌!

18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు జూన్‌లో తొలిసారి సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌ ఆవరణలో సుందరీకరణ పనుల్లో భాగంగా అక్కడున్న మహాత్మాగాంధీ, డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌, ఛత్రపతి శివాజీ సహా ఇతర పోరాటయోధుల కాంస్య విగ్రహాలను తొలగించారు. వీటిని పాత పార్లమెంట్‌ భవనంలోని గేట్‌ నంబర్‌ 5 సమీపంలో ఉన్న పార్క్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని