Viral Video: కార్లతో ఢీకొట్టి.. కర్రలతో కొట్టుకొని: అర్ధరాత్రి హైవేపై గ్రూప్‌ఫైట్‌

Viral Video: అర్ధరాత్రి హైవేపై రెండు గ్రూప్‌లు వీరంగం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

Published : 25 May 2024 14:42 IST

బెంగళూరు: కర్ణాటకలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్డుపై హల్‌చల్‌ చేశారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. మే 18న ఉడుపి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన (Group Fight in Karnataka)కు సంబంధించిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video)గా మారాయి.

ఉడుపి (Udupi)- మణిపాల్‌ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లలో వచ్చిన ఆరుగురు యువకులు వీరంగం సృష్టించారు. మొదట ఓ కారు వేగంగా వెనక్కి వచ్చి మరో వాహనాన్ని ఢీకొట్టింది. అందులో నుంచి యువకులు దిగి కర్రలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే కర్ర పట్టుకున్న ఓ యువకుడిని మరో గ్రూప్‌నకు చెందిన కారు ఢీకొనడటంతో తీవ్రంగా గాయపడ్డాడు.

కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ.. ఇవేం ఫీట్లు బాబోయ్‌..!

సమీపంలోని అపార్ట్‌మెంట్‌ నుంచి ఈ తతంగాన్ని వీడియోలో రికార్డ్‌ చేశారు. కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్‌ దీన్ని తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ చేస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఆ రెండు గ్రూప్‌ల మధ్య ఆర్థికపరమైన వివాదాలున్నాయని, దానివల్ల ఈ గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు