ఆమె గుండెపగిలింది:మాజీ ప్రియుడిపై కసితో..!

ప్రియుడిపై ప్రేమను తెలుపుతూ పువ్వులు, గ్రీటింగ్‌ కార్డులు పంపే ప్రియురాలిను చూసే ఉంటాం. అదే ప్రియుడు బ్రేకప్‌ చెబితే.. కన్నీరుమున్నీరైన అమ్మాయిల్ని చూశాం. మోసం చేశాడంటూ.. న్యాయం కోసం పోరాడిన వారూ ఉన్నారు. కానీ చైనాకు చెందిన ఓ అమ్మాయి దీనికి విభిన్నంగా ప్రవర్తించింది......

Updated : 20 May 2020 10:50 IST

బీజింగ్‌: ప్రియుడిపై ప్రేమను తెలుపుతూ పువ్వులు, గ్రీటింగ్‌ కార్డులు పంపే ప్రియురాలిను చూసే ఉంటాం. అదే ప్రియుడు బ్రేకప్‌ చెబితే.. కన్నీరుమున్నీరైన అమ్మాయిల్ని చూశాం. మోసం చేశాడంటూ.. న్యాయం కోసం పోరాడిన వారూ ఉన్నారు. కానీ చైనాకు చెందిన ఓ అమ్మాయి దీనికి విభిన్నంగా ప్రవర్తించింది. బ్రేకప్‌ చెప్పిన ప్రియుడిపై కసితో అతడి ఇంటికి 1000 కిలోల ఉల్లిపాయలు డోర్‌ డెలివరీ చేసింది. ‘నేను మూడు రోజులు కుంగిపోయా. ఎంతో ఏడ్చా.. ఇప్పుడు నీ వంతు..’ అంటూ తన ప్రతాపాన్ని చూపించింది. ఈ ఘటన ఈస్ట్రన్‌ చైనాలోని జిబోలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు చైనా సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాంలలో వైరల్‌గా మారాయి.

దాదాపు ఏడాదిపాటు ప్రేమించుకున్న తర్వాత జావోకు ఆమె ప్రియుడు బ్రేకప్‌ చెప్పాడు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. మూడు రోజులపాటు ఏడ్చిందట. అయితే తన ప్రియుడు ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చలేదని, అతడ్ని కూడా బాధపెట్టాలని జావో అనుకుంది. అందుకే 1000 కిలోల ఉల్లిపాయల్ని ఆయన ఇంటి ముందు డెలివరీ చేసింది. అంతేకాదు అతడ్ని కలవకుండా, అతడికి తెలియకుండా ఆ ఉల్లిపాయల్ని ఇంటి గుమ్మం వద్ద వేసి రమ్మని డెలివరీ బాయ్‌కు చెప్పింది. ‘నేను మూడు రోజులపాటు ఏడ్చా. ఇప్పుడు నీ వంతు’ అనే సందేశాన్ని కూడా పంపింది. ఇంటి ముందున్న ఉల్లిపాయల్ని బాయ్‌ఫ్రెండ్‌ అయోమయంతో చూస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.

అయితే ఈ ఘటనపై బాయ్‌ఫ్రెండ్‌ స్పందిస్తూ.. జావోకు పొగరు ఎక్కువని చెప్పాడు. ‘నా మాజీ ప్రేయసి ఎక్కువ డ్రామా చేస్తుంది. బ్రేకప్‌ తర్వాత నేను ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చలేదని అందరికీ చెప్పింది. నేను ఏ మాత్రం బాధపడటం లేదని చెప్పింది.. నిజంగా నేను అంత చెడ్డ వ్యక్తినా?’ అని ఆయన అన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts