అత్యాచారయత్నం.. తెగేలా పెదవిని కొరికిన మహిళ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లాలో ఓ మహిళ శనివారం మధ్యాహ్నం పొలంలో ఉండగా.. ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

Published : 06 Feb 2023 06:43 IST

త్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లాలో ఓ మహిళ శనివారం మధ్యాహ్నం పొలంలో ఉండగా.. ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తనను తాను రక్షించుకునే క్రమంలో ఆమె యువకుడి పెదవులను గట్టిగా కొరకడంతో పెదవి భాగం తెగి నేలపై పడింది. సమీప పొలాల్లోని రైతులు వచ్చి నిందితుడిని పట్టుకొన్నారు. తెగిపడిన పెదవిని ఒక ప్యాకెట్‌లో సీల్‌ చేసి, నిందితుడిని చికిత్స నిమిత్తం దౌరాలా సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు