సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు

రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా ధింగ్‌సార గ్రామానికి చెందిన అర్జున్‌ రామ్‌ మెహారియా, భగీరథ్‌ మెహారియా అనే సోదరులు తమ సోదరిపై  ప్రేమను ఘనంగా చాటుకున్నారు.

Updated : 28 Mar 2023 05:10 IST

రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా ధింగ్‌సార గ్రామానికి చెందిన అర్జున్‌ రామ్‌ మెహారియా, భగీరథ్‌ మెహారియా అనే సోదరులు తమ సోదరిపై  ప్రేమను ఘనంగా చాటుకున్నారు. ఆమె పెళ్లికి రూ8.1కోట్ల విలువైన సంపదను కానుకగా ఇచ్చారు. ఇందులో రూ.2.21 కోట్ల నగదు,   4.42 కోట్ల విలువైన భూమి, 1.1కిలోల బంగారం, 14 కిలోల వెండి ఆభరణాలు, స్కూటీ, మరికొన్ని వాహనాలు, ట్రాక్టర్‌ గోధుమలు కూడా ఉన్నాయి. వందల సంఖ్యలో కార్లు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లతో ర్యాలీగా కానుకలను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మైరా సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డ పెళ్లికి అన్నదమ్ములు ఇలా భారీ స్థాయిలో కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ స్థాయిలో ఎవరూ కానుకలు సమర్పించలేదని స్థానికులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని