Love Marriage: 28 ఏళ్ల మహిళతో 60 ఏళ్ల వృద్ధుడి ప్రేమ

ఆరు పదుల వయసున్న ఓ వృద్ధుడు ఇద్దరు పిల్లలున్న ఓ మహిళను ప్రేమించాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా వినకుండా పోలీస్‌ స్టేషన్‌లోనే ఆమెను వివాహం చేసుకున్నాడు.

Updated : 19 May 2023 08:37 IST

పోలీస్‌ స్టేషన్‌లో పెళ్లి

ఆరు పదుల వయసున్న ఓ వృద్ధుడు ఇద్దరు పిల్లలున్న ఓ మహిళను ప్రేమించాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా వినకుండా పోలీస్‌ స్టేషన్‌లోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వింత ఘటన జరిగింది. భదోహి జిల్లాలోని బీహరోజ్‌పుర్‌కు చెందిన రామ్‌ యాదవ్‌(60), 28 ఏళ్ల అషర్ఫీ దేవిని ప్రేమించాడు. ఆమెకు అంతకు ముందే కృష్ణ మూరత్‌ యాదవ్‌తో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కృష్ణ మూరత్‌ తమిళనాడులో పని చేస్తున్నాడు. ఇటీవల అషర్ఫీ దేవి.. రామ్‌ యాదవ్‌తో పారిపోయింది. కృష్ణ మూరత్‌ ఫిర్యాదుతో పోలీసులు రామ్‌ యాదవ్‌, అషర్ఫీ దేవిల ఆచూకీ కనుగొని వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తన భర్తతో వెళ్లనని, రామ్‌ యాదవ్‌నే వివాహం చేసుకుంటానని అషర్ఫీ దేవి పోలీసుల ఎదుట చెప్పింది. రామ్‌ యాదవ్‌ కూడా తన కుటుంబ సభ్యుల మాట వినలేదు. దీంతో చేసేదేమి లేక ఇరువురి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్న గుడిలో బుధవారం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని