19 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చి.. భర్తను మళ్లీ పెళ్లాడిన ఊర్మిళ

పందొమ్మిదేళ్ల కిందట.. మతి తప్పి ఎటో వెళ్లిపోయిన ఓ మహిళ ఇటీవల తిరిగి తన ఇంటికి చేరుకొంది. ఈ ఆనందంలో ఆమె పిల్లలు అమ్మానాన్నలకు మళ్లీ పెళ్లి చేశారు.

Published : 05 Jul 2023 03:54 IST

పందొమ్మిదేళ్ల కిందట.. మతి తప్పి ఎటో వెళ్లిపోయిన ఓ మహిళ ఇటీవల తిరిగి తన ఇంటికి చేరుకొంది. ఈ ఆనందంలో ఆమె పిల్లలు అమ్మానాన్నలకు మళ్లీ పెళ్లి చేశారు. ఒడిశాలోని కటక్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భబ్‌చంద్‌పుర్‌ గ్రామానికి చెందిన బసంత్‌ పరిదా, ఊర్మిళ పరిదా భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2004లో తన మేనల్లుడి ఇంటికి వెళ్తానని బయలుదేరిన ఊర్మిళ.. మతిస్థిమితం కోల్పోయి మళ్లీ ఇంటికి వెళ్లే మార్గం మరిచిపోయింది. ఆమె కోసం ఎంత వెదికినా ఆచూకీ దొరకలేదు. ఇటీవల తిగిరా పట్టణంలోని ఓ ఏటీఎం వద్ద నిస్సహాయ స్థితిలో ఉన్న ఊర్మిళను చూసిన ఓ వ్యక్తి వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో చూసిన జిల్లా కలెక్టర్‌ చొరవతో ఆమె శ్రీ మందిర్‌ సేవాశ్రమానికి చేరింది. ఆశ్రమంలో నెలన్నరపాటు చికిత్స అందించాక కోలుకొన్న ఊర్మిళ పాత జ్ఞాపకశక్తిని మళ్లీ పొందింది. గత సోమవారం తిరిగి ఇంటికి వచ్చిన ఊర్మిళను నుదుట బొట్టు పెట్టి, పూలమాల వేసి భర్త బసంత్‌ స్వాగతించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని