Bald Head: బట్టతలను దాచి రెండోపెళ్లికి యత్నం.. విగ్గు తీసి చితకబాదిన వధువు బంధువులు

బిహార్‌లోని గయ జిల్లా డోభీ పోలీస్‌స్టేషను పరిధి బజౌరా గ్రామంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వివాహితుడైన ఓ వ్యక్తి ఆ విషయం దాచిపెట్టి ఈ గ్రామ యువతిని రెండోపెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.

Updated : 12 Jul 2023 09:26 IST

బిహార్‌లోని గయ జిల్లా డోభీ పోలీస్‌స్టేషను పరిధి బజౌరా గ్రామంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వివాహితుడైన ఓ వ్యక్తి ఆ విషయం దాచిపెట్టి ఈ గ్రామ యువతిని రెండోపెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తనకు బట్టతల ఉందన్న విషయాన్ని కూడా దాచి.. విగ్గు ధరించి పెళ్లిమండపానికి వచ్చాడు. కొద్దిసేపట్లో పెళ్లి అవుతుందనగా వధువు బంధువులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా.. అతడికి ఇది రెండోపెళ్లని, విగ్గు ధరించి వివాహానికి వచ్చాడని తెలిసిపోయింది. ఆగ్రహించిన వధువు బంధువులు ‘పెళ్లికొడుకు’ను చితకబాదారు. తాను చేసింది తప్పేనని, వదిలేయాలంటూ నిందితుడు ప్రాధేయపడ్డాడు. ఇంతలో విషయం తెలుసుకున్న అతడి భార్య సైతం ఘటనా స్థలానికి వచ్చింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. గ్రామపెద్దలు పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని