బిహార్‌లో అద్భుతం.. బోరుబావిలో పడిన బాలుడు సురక్షితం

బిహార్‌లోని నలంద జిల్లాలో ఆదివారం బోరుబావిలో పడిన అయిదేళ్ల బాలుడు మృత్యువును జయించాడు. శిలాయో బ్లాక్‌లోని కుల్‌ గ్రామంలో స్నేహితులతో ఆడుకుంటూ శివమ్‌ కుమార్‌ ప్రమాదవశాత్తు 50 అడుగుల బోరుబావిలో పడిపోయాడు.

Updated : 24 Jul 2023 07:58 IST

నలంద: బిహార్‌లోని నలంద జిల్లాలో ఆదివారం బోరుబావిలో పడిన అయిదేళ్ల బాలుడు మృత్యువును జయించాడు. శిలాయో బ్లాక్‌లోని కుల్‌ గ్రామంలో స్నేహితులతో ఆడుకుంటూ శివమ్‌ కుమార్‌ ప్రమాదవశాత్తు 50 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయక బృందాలు బాలుడిని రక్షించేందుకు జేసీబీ యంత్రాలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టాయి. బాలుడికి ఆక్సిజన్‌ అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసి చివరకు ఆ చిన్నారిని కాపాడటంలో అధికార యంత్రాంగం విజయవంతమైంది. బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడటంపై తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు బాగానే ఉన్నాడని ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి రంజిత్‌ కుమార్‌ వెల్లడించారు. చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని