పదేళ్ల క్రితం తప్పిపోయిన భర్త అతడే అనుకొని..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో.. మతిస్థిమితం లేని వ్యక్తిని పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తగా భావించి ఎంతో హడావుడి చేసిన ఇల్లాలు చివరకు నిజం తెలిసి నాలిక్కరుచుకుంది.

Published : 31 Jul 2023 03:49 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో.. మతిస్థిమితం లేని వ్యక్తిని పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తగా భావించి ఎంతో హడావుడి చేసిన ఇల్లాలు చివరకు నిజం తెలిసి నాలిక్కరుచుకుంది. బలియా పోలీస్‌స్టేషను ప్రాంతంలోని దేవ్‌కలి గ్రామానికి చెందిన మోతీచంద్‌ వర్మకు 21 ఏళ్ల క్రితం జానకీదేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత మోతీచంద్‌ మానసిక పరిస్థితి క్షీణించడంతో వైద్యం కోసం బంధువులతో కలిసి నేపాల్‌కు వెళ్లాడు. అక్కడే తప్పిపోయి.. ఆచూకీ లేకుండా పోయాడు. భర్త గురించి తెలుసుకునేందుకు జానకీదేవి చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో శనివారం బలియా జిల్లా ఆస్పత్రి రోడ్డు పక్కన చిరిగిన పాత దుస్తులు, పెరిగిన గడ్డంతో ఉన్న వ్యక్తిని చూసి మోతీచంద్‌ అనుకొని జానకి సంబరపడిపోయింది. కుమారులకు పరిచయం చేసి ఇంటికి తీసుకువెళ్లింది. అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి పుట్టుమచ్చలు పరిశీలించిన జానకీదేవికి జరిగిన పొరపాటు తెలిసివచ్చి.. ఆ వ్యక్తిని క్షమాపణలు కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు