Early Polls: ఒడిశాలో ‘ముందస్తు’ ఊహాగానాలు..! త్వరలో ఎన్నికల బృందం పర్యటన

ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు (Odisha) ముందుగానే వెళ్లవచ్చనే ఊహాగానాలు మొదలైన సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బృందం అక్కడ పర్యటించేందుకు సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 30 Aug 2023 01:47 IST

భువనేశ్వర్‌: మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్నాయి. ఇదే సమయంలో లోక్‌సభకూ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జాతీయ స్థాయి నేతలూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా కూడా అసెంబ్లీ ఎన్నికలకు (Odisha) ముందుగానే వెళ్లవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బృందం అక్కడ పర్యటించేందుకు సిద్ధం కావడంతో.. ఈ వాదనలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

సెప్టెంబర్‌ 13న కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటించి.. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నట్లు రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (CEO) నికుంజ బిహారీ ధల్‌ పేర్కొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను అక్టోబర్‌లో పరిశీలించి, నవంబర్‌ 15వరకు సిద్ధంగా ఉంచుతామన్నారు. అయితే, కేంద్ర బృందం పర్యటనకు ముందస్తుతో సంబంధం లేదని బిహారీ ధల్‌ వెల్లడించారు.

ఇందిరాగాంధీ చంద్రుడి వద్దకు చేరుకున్నప్పుడు..! మరోసారి తడబడిన మమత

ఒడిశాలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని అధికార బిజూ జనతాదళ్‌ (BJD)తోపాటు భాజపా, కాంగ్రెస్‌లు ఇటీవల ప్రకటనలు చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాలతోపాటే ఒడిశా సైతం ముందస్తుకు వెళ్తుందని విపక్ష భాజపా, కాంగ్రెస్‌లు అంచనా వేస్తున్నాయి. బిజేడీ ముందస్తుకు వెళ్లవచ్చని ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మొదటిసారి లేవనెత్తారు. మరో భాజపా నేత, అదే రాష్ట్రానికి చెందిన ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగి కూడా స్పందిస్తూ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను వేర్వేరుగా పెట్టడం వల్ల ఖర్చు రెట్టింపు అవడంతోపాటు అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్నారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే ఏడాది జూన్‌ వరకు గడువు ఉన్నప్పటికీ.. ఇలా నాయకుల ఊహాగానాలతో ముందస్తు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు