అన్నం పెట్టిన రైతుకు.. కంటతడితో వానర నివాళి

సాధారణంగా కోతిని అల్లరి జంతువుగానే చూస్తాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి జిల్లాలో ఓ కోతి చూపిన విశ్వాసం చర్చనీయాంశంగా మారింది.

Published : 11 Sep 2023 06:27 IST

సాధారణంగా కోతిని అల్లరి జంతువుగానే చూస్తాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి జిల్లాలో ఓ కోతి చూపిన విశ్వాసం చర్చనీయాంశంగా మారింది. భీరా పోలీస్‌స్టేషను పరిధిలోని గోంధియా గ్రామానికి చెందిన చందన్‌వర్మ అనే రైతుకు ఊరి శివార్లలో పొలం ఉంది. రోజూ పొలం వద్ద భోజనం చేసే సమయంలో ఓ కోతి చందన్‌ దగ్గరకు వచ్చేది. ఆ ఆహారంలో నుంచే కొంత కోతికి పెట్టేవాడు. ఇది నిత్యకృత్యంగా మారడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇటీవల పక్షవాతం బారినపడ్డ చందన్‌ శనివారం మృతిచెందాడు. బంధువులంతా అతడి ఇంటికి చేరుకున్నారు. ఇంతలో ఆ కోతి.. కూడా రైతు ఇంటికి వచ్చింది. చందన్‌ మృతదేహంపై కప్పి ఉన్న దుప్పటి తీసి అతణ్ని చూసి కంటతడి పెట్టింది. కోతిని చూసి మొదట భయపడ్డ జనం అది ఎవరిపైనా దాడి చేయకపోవడంతో మిన్నకుండిపోయారు. చందన్‌ అంత్యక్రియలు పూర్తయ్యేవరకు కోతి అక్కడే ఉండిపోయింది. ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు