200 గంటలు.. 300 సమావేశాలు.. 15 ముసాయిదాలు..

జీ20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య దిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడానికి మన దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్లు జీ20 భారత దేశ ప్రతినిధి(షెర్పా) అమితాబ్‌ కాంత్‌ తెలిపారు.

Updated : 11 Sep 2023 10:07 IST

దిల్లీ డిక్లరేషన్‌ వెనుక భారీ కసరత్తు
జీ 20 భారత ప్రతినిధి అమితాబ్‌ కాంత్‌

దిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య దిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడానికి మన దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్లు జీ20 భారత దేశ ప్రతినిధి(షెర్పా) అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. దాదాపు 200 గంటల పాటు నిరంతర చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు. అదనపు కార్యదర్శులైన ఈనం గంభీర్‌, కె.నాగరాజు నాయుడితో కూడిన దౌత్యవేత్తల బృందం 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. వివాదాస్పద ఉక్రెయిన్‌ అంశంపై ఇతర దేశాల్లోని తమ సహచరులతో 15 ముసాయిదాలను పంచుకున్నట్లు వివరించారు. వీరందరి కృషి వల్లే జీ20 సదస్సు తొలిరోజే నేతల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైందన్నారు. ‘‘మొత్తం జీ20 సదస్సులో అత్యంత సంక్లిష్టమైన భాగం భౌగోళిక రాజకీయాలపై (రష్యా-ఉక్రెయిన్‌) ఏకాభిప్రాయం తీసుకురావడం. ఇది 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాల వల్లే సాధ్యమైంది. నాగరాజు నాయుడు, గంభీర్‌ ఈ విషయంలో ఎంతో సహకరించారు’’ అని అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని