Gautami: రూ.25 కోట్ల విలువైన స్థలం ఆక్రమించారు.. నటి గౌతమి ఫిర్యాదు

రూ.25 కోట్ల విలువైన తన స్థలం ఆక్రమణకు గురైనట్లు సినీ నటి గౌతమి సోమవారం గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనరు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

Updated : 13 Sep 2023 08:13 IST

చెన్నై(ప్యారిస్‌), న్యూస్‌టుడే: రూ.25 కోట్ల విలువైన తన స్థలం ఆక్రమణకు గురైనట్లు సినీ నటి గౌతమి సోమవారం గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనరు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్థలాన్ని తన కుమార్తె పేరిట రాసేందుకు గతంలో స్థిరాస్తి వ్యాపారి అళగప్పన్‌ను సంప్రదించగా ఆయన మోసం చేశారని వెల్లడించారు. శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ఆ స్థలాన్ని అళగప్పన్‌, అతని భార్య తదితరులు ఆక్రమించుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి అళగప్పన్‌ బెదిరిస్తున్నాడని, అతనిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని