భారత్‌కు తిరిగొచ్చిన అంజూ

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి.. అక్కడే రెండోపెళ్లి చేసుకున్న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ (34) తిరిగి భారత్‌కు వచ్చింది.

Updated : 30 Nov 2023 06:19 IST

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి.. అక్కడే రెండోపెళ్లి చేసుకున్న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ (34) తిరిగి భారత్‌కు వచ్చింది. వాఘా సరిహద్దు ద్వారా ఆమె స్వదేశంలోకి మళ్లీ అడుగు పెట్టింది. పాక్‌కు చెందిన నస్రుల్లా (29) అనే యువకుడితో అంజూకు 2019లో ఫేస్‌బుక్‌ పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె.. అనూహ్యంగా అతణ్ని పెళ్లి చేసుకుంది. బుధవారం నస్రుల్లా సరిహద్దుదాకా ఆమె వెంట వచ్చి భారత్‌లోకి సాగనంపాడు. అంజూకు అప్పటికే వివాహమై 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. పాక్‌లో పెళ్లి చేసుకున్నాక ఆమె ఫాతిమాగా మారింది. ఈమె నిర్వాకంతో భారత్‌లోని కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో నస్రుల్లా ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. అంజూ తిరిగి భారత్‌కు వస్తుందని చెప్పాడు. ఆమె మానసిక వేదనతో సతమతమవుతోందని, తన ఇద్దరు పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు అతడు వెల్లడించాడు. వాఘా వద్ద అంజూ మీడియాతో మాట్లాడుతూ ‘‘నా కుటుంబాన్ని కలిసేందుకు ఇష్టప్రకారమే భారత్‌కు వచ్చాను’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని