రూ.4,950 విద్యుత్తు బిల్లుకు.. రూ.197 కోట్ల రసీదు!

నెలనెలా విద్యుత్తు బిల్లు కట్టేటప్పుడు చెల్లించిన మొత్తానికి సిబ్బంది రసీదు ఇస్తారు. ఒకవేళ చిల్లర లేదని ఎక్కువగా చెల్లిస్తే.. తర్వాతి బిల్లులో ఆ మొత్తాన్ని తగ్గిస్తారు.

Published : 02 Dec 2023 04:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెలనెలా విద్యుత్తు బిల్లు కట్టేటప్పుడు చెల్లించిన మొత్తానికి సిబ్బంది రసీదు ఇస్తారు. ఒకవేళ చిల్లర లేదని ఎక్కువగా చెల్లిస్తే.. తర్వాతి బిల్లులో ఆ మొత్తాన్ని తగ్గిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన చౌహారీదేవి అనే మహిళ రూ.4,950 బిల్లు చెల్లిస్తే.. రసీదు మాత్రం రూ.197 కోట్లకు ఇచ్చారు. ఆమె మళ్లీ చూసుకోకుండా రసీదును ఇంట్లో ఎక్కడో పెట్టేసింది. విద్యుత్తు సిబ్బంది లెక్కలు సరిచూసుకునేటప్పుడు.. వసూలైన నగదుకు, విద్యుత్తు ఛార్జీల పోర్టల్‌లో చూపించిన మొత్తానికి పొంతన లేకపోవడంతో తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించారు. చౌహారీదేవి పేరిట ఉన్న విద్యుత్తు కనెక్షను 197....000తో మొదలవుతుంది. వసూళ్ల సమయంలో సిబ్బంది బిల్లు మొత్తానికి బదులు పొరపాటున కనెక్షన్‌ నంబరు నొక్కారు. దీంతో అది రూ.197 కోట్లుగా నమోదైంది. వినియోగదారు నుంచి తీసుకున్నది మాత్రం రూ.4,950 కావడంతో భారీ తేడా వచ్చింది. దీంతో పాత  బిల్లును రద్దు చేసి.. తాజాగా మరో రసీదును ఆమెకు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని