లోక్‌సభ సీట్ల పంపకంపై తేల్చాలి

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం అంశాన్ని తేల్చాలని ‘ఇండియా’ కూటమి సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) లేవనెత్తింది.

Published : 05 Dec 2023 04:11 IST

‘ఇండియా కూటమి’ సమావేశంలో లేవనెత్తిన టీఎంసీ
దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం అంశాన్ని తేల్చాలని ‘ఇండియా’ కూటమి సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) లేవనెత్తింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విపక్ష పార్టీల నేతలు సోమవారం ఉదయం పార్లమెంటులోని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఎంసీ తరఫున పాల్గొన్న డెరిక్‌ ఓబ్రియన్‌, సుదీప్‌ బందోపాధ్యాయలు రానున్న లోక్‌సభ ఎన్నిక సీట్ల పంపకం అంశాన్ని త్వరగా తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఒక స్పష్టత వస్తే ప్రచారం చేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం లభిస్తుందని తెలిపారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తమను కలుపుకొని వెళ్లలేదని ఆరోపణలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఈ సమావేశానికి గైర్హాజరవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని