మోదీ యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్క్రైబర్లు 2 కోట్లు

ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత యూట్యూబ్‌ ఛానల్‌ మంగళవారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఛానల్‌ సబ్‌స్క్రైబర్ల (వీక్షకుల) సంఖ్య రెండు కోట్లు దాటింది. ప్రపంచంలో మరే ఇతర నేతకూ ఇలాంటి ఘనత లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి.

Published : 27 Dec 2023 08:02 IST

ప్రపంచ నేతలందరిలో అగ్రస్థానం

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత యూట్యూబ్‌ ఛానల్‌ మంగళవారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఛానల్‌ సబ్‌స్క్రైబర్ల (వీక్షకుల) సంఖ్య రెండు కోట్లు దాటింది. ప్రపంచంలో మరే ఇతర నేతకూ ఇలాంటి ఘనత లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఈ ఛానల్‌ను మోదీ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటూ వస్తున్నారు. ఛానల్‌లో మోదీ పోస్ట్‌ చేసిన వీడియోలకు వీక్షణలు (వ్యూస్‌) 450 కోట్ల పైమాటే. ఛానల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో రెండోస్థానంలో ఉన్నారు. ఆయనకు 64 లక్షల మంది వీక్షకులు ఉన్నారు. మోదీతో పోలిస్తే ఇది మూడోవంతు కంటే తక్కువే. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పోస్ట్‌ చేసిన వీడియోలకు వ్యూస్‌ 22.4 కోట్లు. ఆ విషయంలో మోదీ తర్వాత స్థానం ఆయనదే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 7.89 లక్షల మంది, తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌కు 3.16 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రధాని మోదీతో ముడిపడిన యూట్యూబ్‌ ఛానల్‌- ‘యోగా విత్‌ మోదీ’కి 73,000 మంది, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఛానల్‌కు 35 లక్షల మంది చందాదారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని