లక్షద్వీప్‌లో మోదీ సాహసం

లక్షద్వీప్‌లో మంగళ, బుధవారాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి దీవుల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించారు. సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు.

Updated : 05 Jan 2024 06:55 IST

‘స్నార్కెలింగ్‌’ చేసినట్లు వెల్లడించిన ప్రధాని

దిల్లీ: లక్షద్వీప్‌లో మంగళ, బుధవారాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి దీవుల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించారు. సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు. అంతేకాదు.. సముద్రంలో స్నార్కెలింగ్‌ (సాహసంతో కూడిన స్విమ్మింగ్‌) కూడా చేశారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ‘ఎక్స్‌’ ఖాతాలో గురువారం పంచుకున్నారు. ‘‘లక్షద్వీప్‌  సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నా. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 140కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం నేను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం నాకు నేర్పింది. సాహసాలు చేయాలనుకునేవారు.. మీ జాబితాలో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోండి’’ అని మోదీ రాసుకొచ్చారు. లక్షద్వీప్‌లో తాను స్నార్కెలింగ్‌ కూడా ప్రయత్నించినట్లు మోదీ తెలుపుతూ ఆ చిత్రాలను కూడా షేర్‌ చేశారు. పగడపు దీవులు, చేపల ఫొటోలను పంచుకున్నారు. ‘ఇది ఎంతో అద్భుతమైన అనుభవం’ అని పేర్కొన్నారు.

స్నార్కెలింగ్‌ అనేది సముద్రంలో చేసే ఓ తరహా డైవింగ్‌ లాంటిది. స్నార్కెల్‌ అనే ట్యూబ్‌, డైవింగ్‌ మాస్క్‌ను ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొడతారు. ఈ స్నార్కెలింగ్‌తో సముద్ర గర్భంలో పర్యావరణాన్ని, జీవరాశులను అన్వేషించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని